telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ఓ సుగుణ సుందరీ. .  !

prema khaidi poetry corner

ఓ సుగుణ సుందరీ . . ! 
నా ప్రేమ మనోహరీ ! ! 
మూగపోయిన నా మనసు వీణ
నీ పిలుపుతో ఆనందభైరవ
రాగం శృతి చేస్తోంది ! 
ఆమని కోయిలలా . . 
ప్రేమ గీతం అలపిస్తోంది !
పురి విప్పిన మయూరిలా . . . 
పరవశించి నాట్యమాడు తోంది !
వానకారు సెలయేరులా . . 
పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది !
వసంతంలో తరువు లా . .
మిళమిళ మెరుస్తూ కళకళలాడుతోంది !
వ్యర్థం అనుకున్న నాజీవితానికి
అర్థం చేకుర్చావు !
పరమార్ధం తో జీవించమని ప్రబోధించావు ! 
నన్ను మనీషి గా తీర్చినావు ! ! 

Related posts