telugu navyamedia
వార్తలు సామాజిక

రైల్ ప్రయాణాలపై మే 17 వరకు నిషేధం!

Train Indian railway

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై మే 17 వరకు నిషేధం ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాల మేరకు ఇతర ప్రాంతాల్లోచిక్కుకున్న వారి కోసం ప్రత్యక రైళ్లను నడుపుతామని తెలిపింది.

వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లినవారు తమ గమయస్థానాలకు చేరుకోవడానికి శ్రామిక్ రైళ్లను మాత్రం నడుపుతామని ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్ కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దని విన్నవించింది. సరుకు రవాణా, పార్సిల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Related posts