telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కస్టమర్ కేర్ కి … 24వేలసార్లు ఫోన్ చేశాడని .. వృద్ధుడి అరెస్ట్… ఎక్కడో తెలుసా..

Arrest

జపాన్ పోలీసులు 71 ఏళ్ళ వయసులో ఓ వృద్దుడిని అరెస్ట్ చేశారు. మనకి సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రాకపోతే ఏమి చేస్తాం, కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి సమస్య అడిగి తెలుసుకుని పరిష్కారం వెదుకుతాం. జపాన్ లోని టోక్యో లో ఉండే ఓ వృద్దుడు కూడా అదే పనిచేశాడు, కానీ అరెస్ట్ అయ్యాడు. అదేంటి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అనుకోకండి. ఆయన గారు కస్టమర్ కేర్ కి దాదాపు 24 వేల సార్లు ఫోన్ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కంపెనీ పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించింది.

ఆయన పేరు అకితోషి ఒకామో. ఈ వృద్దుడు కేడీడీఐ అనే టెలికం కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కి 24 వేల సార్లు ఫోన్ చేసి కంపెనీ తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టాడట. అంతేకాదు కంపెనీ యాజమాన్యం తన వద్దకి వచ్చి మరీ క్షమాపణ చెప్పాలని హుకుం జారీ చేశాడట. దాంతో మండిపడ్డ కంపెనీ సదరు తాత పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేసిన పోలీసులు తాతని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారట. పాపం 71 ఏళ్ళ వయసులో ఎంత కష్టం వచ్చిందో అంటూ సోషల్ మీడియాలో ప్రజలు తాతకి సానుభూతి తెలుపుతున్నారు.

Related posts