telugu navyamedia
క్రైమ్ వార్తలు

దుర్గమ్మ దర్శనానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో తెలంగాణ నిజమాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు  కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.  

వివ‌ర్లాలోకి వెళితే..

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌, అతని భార్య పప్పుల శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ కలిసి ఈ నెల 6వ తేదీన దుర్గమ్మ దర్శనానికి విజ‌య‌వాడ‌కుకు వెళ్లారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో ని 3వ ఫ్లోర్‌లో పప్పుల అఖిల్‌ పేరుతో రూమ్‌ తీసుకున్నారు.

అయితే సురేష్ కొడుకు అఖిల్ పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాడు. ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడం ఆలస్యం కావడంతో వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.

సురేష్ కుటుంబం విజయవాడకు వెళ్లిన తర్వాత రోజు.. ప్రైవేట్ పైనాన్సర్ వారు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇళ్లు తమకు చెందినదని గోడలపై రాసి వెళ్లారు. అంతేకాకుండా ఈ విషయం గురించి వారు చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియజేశారు. సీజ్ చేస్తామనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య (వీడియో) | Four members of one family suicide in vijayawada

ఈ విషయంపై అర్ధరాత్రి రెండున్నర గంటలకు కుటుంబ స‌భ్య‌ల‌కు శ్రీలత వాయిస్ మెసేలు పంపించారు. మరోవైపు ఆమె భర్త సురేష్..మ‌రో కుమారుడు తాము ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా బంధువులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రంలో దిగిన మా వాళ్లు ఆత్మహత్య చేసుకోబోతున్నారని కాపాడండి అని చెప్ప‌డంతో   సత్రం మేనేజర్ శ్రీధర్.. ఈ విషయాన్ని సత్రం చైర్మన్‌కు తెలియజేశారు. 

 

వెంటనే సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా… అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులు 20 ఇన్సులిన్ బాటిల్స్‌ను, సిరంజీలను ఉండ‌డంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

తల్లి శ్రీలత, కొడుకు అశిష్.. 20 ఇన్సులిన్ ఇంజెక్ట్ బాటిల్స్ ఇంజెక్టు చేసుకునని ఆత్మహత్య చేసుకున్నారు. మెడిసిన్‌పై అవగాహనతోనే వీరు ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. వారు ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులు 20 ఇన్సులిన్ బాటిల్స్‌ను, సిరంజీలను గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాఫ్తు చేస్తున్నారు.

Related posts