telugu navyamedia
telugu cinema news trending

ఆరు గెటప్స్ లో ఎన్టీఆర్…!?

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రంలో కీల‌క పాత్రలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఆరు గెటప్స్ కనిపిస్తాడన్న ఓ న్యూస్ ఆసక్తి రేపుతోంది. శత్రువులను మట్టికరిపించడానికి, తప్పుదోవ పట్టించడానికి ఎన్టీఆర్ వివిధ వేషధారణలతో కనిపిస్తారట. మరి ఇదే కనుక నిజం అయితే ఇక ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి.

Related posts

శివుని ఆశీస్సులతో అద్భుతమైన ప్రదేశంలో “వాల్మీకి” షూటింగ్

vimala p

“బ్యాట్ మెన్” హీరోకు కరోనా ?

vimala p

మరోసారి లీక్ అయిన ఫేస్ బుక్ డేటా.. ఈసారి అధినేతదే… చోరీ.. !!

vimala p