నేనూ – నీరవమూ
ఒకరితో ఒకరం జతగా ఉన్నప్పుడు
నా జీవితంలోకి నవ్వుతూ నువ్వొచ్చావు!
నువ్వూ నేనూ
ఒకరికి ఒకరం…
పాట పల్లవిలా
మబ్బు మేఘంలా ఉన్నామిప్పుడు!
నువ్వు
నా కంటి వెలుగువో
నా కనురెప్పల మాటున స్వప్నానివో
ఇదీ అని చెప్పలేని సందిగ్ధం నాది!
నేడు
నీ జీవన సహచరిగా
నీ గుండె సవ్వడిగా
నీ శ్వాసకు జతగా నిలిచే సౌభాగ్యం నాది!
నువ్వే
నా పచ్చని ఆశల తోటమాలి
నా నవ్వుల వెన్నెల జాబిలి!
నేను –
నీ వేకువ వాకిట వెలిగే
నులి వెచ్చని ప్రభాతాన్ని!
నీ కమ్మని కవితల్లో ఒదిగే
మది మెచ్చిన అక్షరాన్ని!
– సాంబమూర్తి లండ.
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్