telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. ఆఖరి పోరు ఆసక్తిగా.. బరిలో ఇంగ్లాండ్-న్యూజీలాండ్ ..

newzeland given target as 242 to england

లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఆఖరి పోరులో ఇంగ్లాండ్ ముందు సులువైన లక్ష్యం నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు మాత్రమే చేసింది. లార్డ్స్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు కివీస్ ఆటగాళ్లు మొదటి నుంచి ఆపసోపాలు పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లు తమకు బాగా పరిచయం ఉన్న లార్డ్స్ పిచ్ పై సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ న్యూజిలాండ్ టాపార్డర్ ను కట్టడి చేశారు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఈసారి 30 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరగడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. 55 పరుగులు చేసిన ఓపెనర్ హెన్రీ విలియమ్స్ ఆ జట్టులో టాప్ స్కోరర్ కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్ 47 పరుగులు చేయడంతో కివీస్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ తో సరిపెట్టుకున్నాడు. కాగా, కివీస్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ ఉడ్ విసిరిన ఓ బంతి గంటకు 154 కిలోమీటర్ల వేగం నమోదు చేయడం విశేషం.

Related posts