telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నేటి నుండే.. ఇంద్రకీలాద్రిపై … శాకాంబరి ఉత్సవాలు..

durgamma as sakambari in vijayawada

ఆషాఢమాసం ప్రారంభం కావటంతో అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనక దుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తన కుటుంబ సభ్యులతో క‌లిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. వెల్లంపల్లి తన కుటుంబసభ్యులతో అమ్మ వారి దర్శనం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఇంద్రకీలాద్రి పై మూడు రోజులపాటు శాకాంబరీ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా పేర్కొన్నారు.

Related posts