telugu navyamedia
సినిమా వార్తలు

“పీఎం నరేంద్ర మోదీ” కొత్త ట్రైలర్

PM-Narendramodi

ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “పీఎం నరేంద్ర మోదీ”. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ మోదీ పాత్ర పోషిస్తున్నారు. మేరీకోమ్‌, సరబ్‌జిత్‌ వంటి చిత్రాలు తీసిన ఒముంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. మోదీ రాజకీయ జీవితం ఆరంభమైనప్పటి నుంచి 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకూ అనేక అంశాలు, విశేషాలు సినిమాలో ఉంటాయి. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను మే 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోషన్ కార్య‌క్రమాలు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, నటుడు వివేక్‌ ఒబెరాయ్ చేతుల మీదుగా పోస్ట‌ర్ విడుద‌ల కాగా, తాజాగా చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో మోదీ ప‌డిన క‌ష్టాలు , చాయ్ వాలా నుండి ఆయ‌న ప్ర‌ధాన మంత్రిగా ఎదిగిన తీరు త‌దిత‌ర అంశాల‌ని చూపించారు. ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts