telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”లో నయనతార రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే…!

Syeraa

లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం నయనతార దూరంగా ఉంటుంది. సినిమాకు సంతకం చేసే సమయంలోనే ఈ మేరకు కండీషన్ పెడుతుంది. “సైరా”కు మాత్రం నయన్ మినహాయింపునిచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. “సైరా” ప్రమోషన్ కార్యక్రమాలకు నయనతార హాజరవుతుందని అనుకున్నారు. అయితే “సైరా”కు కూడా నయన్ పాత పద్ధతినే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన “సైరా” టీజర్ లాంఛ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైనా నయనతార మాత్రం రాలేదు. అయితే దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్నందుకు నయనతారకు భారీ పారితోషికమే దక్కిందట. `సైరా`లో నటించినందుకు నయన్ దాదాపు ఆరు కోట్ల రూపాయలు అందుకుందట. ఇంత భారీగా పారితోషికం అందుకున్నప్పటికీ ఇప్పటివరకు జరిగిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం నయన్ హాజరుకాలేదు.

Related posts