telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమ్మఒడి చాలా గొప్ప పథకం..టీడీపీ ఎంపీ కేశినేని ప్రశంసలు

kesineni-nani

ఏపీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించే విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తొలిసారి ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకం విధివిధానాలు సరిగ్గా ఉంటే ప్రతీ తల్లికి సంవత్సరానికి రూ.15,000 అందుతాయని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయాలనీ, ఆ స్కూళ్లే ఎంతో మంది మేధావులను దేశానికి అందించాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దని కేశినేని నాని స్పష్టం చేశారు.

Related posts