telugu navyamedia
సినిమా వార్తలు

సారీ రా జున్ను… : నాని

Nani, Junnu
“జెర్సీ” తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. 
ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. నిజ‌జీవితంలో నాని కొడుకు పేరు అర్జున్‌. ఈ నేప‌థ్యంలో నాని తాజాగా ట్విట‌ర్‌లో షేర్ చేసిన ఫోటో ఒక‌టి హల్చల్ చేస్తోంది. అర్జున్ పేరుతో ఉన్న టీష‌ర్టును నాని ధ‌రించాడు. ప‌క్క‌నే కూర్చున్న నాని కొడుకు అర్జున్ టీష‌ర్టుపై “నాన్న నా పేరును దొంగిలించాడు” అని రాసుంది. ఈ ఫోటోను ట్విట‌ర్‌లో షేర్ చేసిన నాని “సారీ రా జున్ను.. త‌ప్ప‌లేదు” అని కామెంట్ చేశాడు.

Related posts