telugu navyamedia
సినిమా వార్తలు

నిఖిల్ సినిమాకు టైటిల్ సమస్య ?

nikhil-and-harish-shankar
నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో “ముద్ర” సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల క్రితమే ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్న చిత్రబృందానికి టైటిల్ విషయంలో సమస్య తెలెత్తిందనేది తాజా సమాచారం.
“ముద్ర” అనే టైటిల్ ను వీళ్లకన్నా ముందే వేరేవాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో నిఖిల్ సినిమా టైటిల్ ను మార్చాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు “అర్జున్ సురవరం”… అందుకే ఇదే పేరును టైటిల్ గా ఖరారు చేయాలనే ఆలోచనతో ఉన్నారట దర్శకనిర్మాతలు. త్వరలోనే సినిమా టైటిల్ ను ఖరారు చేసి, సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు

Related posts