telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హోటల్ బిజినెస్ మొదలుపెట్టిన ‘జెర్సీ’ హీరోయిన్

sraddha

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. జెర్సీ సినిమాలో న్యాచురల్ స్టార్‌తో రొమాన్స్ చేసిన బ్యూటీనే శ్రద్ధా శ్రీనాథ్. ఈ ముద్దుగుమ్మకు కన్నడలో మంచి క్రేజ్ ఉంది. అక్కడ వరస సినిమాలు కూడా చేస్తుంది. జెర్సీలో ఈమె నటనకు ఇక్కడ కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. వరస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా మొదలుపెట్టింది ఈ బ్యూటీ. చెన్నైలో ‘పర్ సే’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించింది శ్రద్ధా శ్రీనాథ్. అందులో ఫుడ్స్ కంటే కూడా సలాడ్స్ ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ సీజన్ కావడంతో బిజినెస్ కూడా బాగుంటుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. దీన్ని రెస్టారెంట్ అనేకంటే కూడా సలాడ్ బార్ అండ్ కేఫ్ అని చెప్పొచ్చేమో..? రెగ్యులర్ బర్గర్స్, సాండ్ విచ్ లాంటి ఫుడ్స్ కాకుండా హెల్తీ ఫుడ్ తమ రెస్టారెంట్‌లో ఉంటుందని శ్రద్ధా శ్రీనాథ్ చెబుతుంది. 

Related posts