telugu navyamedia
సినిమా వార్తలు

విడుదలయ్యాక పేదలకు చేయూత‌నిస్తా- ఆర్యన్ ఖాన్

బాలీవుడ్ నటుడు షారుఖ్​ ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​కు పోలీసులు శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను విడుదలైన తర్వాత అందరూ గర్వపడేలా.. పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. ఇకపై చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని ఎన్‌సీబీ అధికారులకు తెలిపాడు .

ఈ నెల 2న కార్డిలా క్రూయిజ్​ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. విచారణ తర్వాత, ఆర్యన్‌ను అక్టోబర్ 8న ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం న్యాయవాదులు బెయిల్ కోసం పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ముంబై కోర్టు వెల్లడించింది.

Shah Rukh Khan opens up about his elder son Aryan Khan's career choice

ఈ క్రమంలో ముంబయిలోని ఓ జైలులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ అధికారులు జైలులో విచారణతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్యన్​ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ‘‘పేదలు, అణగారిన వర్గాల ప్రజలకుచేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా’’ అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్‌ పిటిషన పై ప్రత్యేక కోర్టు ఈనెల 20న ఆదేశాలు ఇవ్వనుంది.

Related posts