telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” ఇన్ని రోజులు చేయాల్సింది కాదు : నాగబాబు

Nagababu

గత కొన్ని రోజులుగా బుల్లితెరపై జబర్దస్త్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా జబర్దస్త్ నుంచి జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి బాగా ఫేమస్ అయిన టీం లీడర్స్ కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్ళడం బుల్లితెర వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కొనసాగుతున్న జబర్దస్త్ నాగబాబు జబర్దస్త్ టీమ్ లీడర్స్ కూడా ఇప్పటికే జీతెలుగు లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ షో ఎలా మొదలైంది? అసలు అప్పుడేం జరిగింది ? అనేది చెప్పుకొచ్చాడు. ఈ షోలోకి తాను రావడానికి ప్రధాన కారణం అదుర్స్ అనే షో అని చెప్పాడు నాగబాబు. అప్పుడు ఆయన దానికి జడ్జ్‌గా ఉన్నానని, అప్పుడు ఏడుకొండలు అనే మేనేజర్ తనకు టచ్‌లో ఉండేవాడని చెప్పాడు మెగా బ్రదర్. ఆయన నుంచి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిసానని.. ఆయన అప్పటి వరకు తనకు డైరెక్ట్‌గా ఫోన్ చేయలేదని చెప్పాడు నాగబాబు. వాళ్ల మల్లెమాల బ్యానర్ నుంచి అదుర్స్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారని, దానికి మీరు జడ్జిగా ఉండాలన్నారని చెప్పాడు. దానికి తాను కూడా హ్యాపీగానే ఒప్పుకున్నానని, అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంత లాంగ్ షో చేద్దామని అనుకోలేదని చెప్పాడు.

కేవలం జబర్దస్త్‌ను 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని.. దానికి తనతో పాటు రోజాను జడ్జిగా ఉండాలని కోరినట్లు చెప్పాడాయన. తాను ఇష్టపడితే 25 కాదు.. ఎన్ని ఎపిసోడ్స్ చేయడానికైనా సిద్ధమే అని చెప్పానని అన్నారు నాగబాబు. కానీ అప్పటికే తాను ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం, రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరడం జరిగిందని, ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నుంచి రావడంతో చేయాలా వద్దా అని ఆలోచించినట్లు చెప్పాడు నాగబాబు. అయితే పొలిటికల్ విభేదాలు వేరు.. క్రియేటివ్ ఫీల్డ్ వేరు అని అర్థం చేసుకుని తాను జడ్జిగా ఒప్పుకున్నట్లు చెప్పాడు. 8 ఏళ్ల కింద మొదలైన ఈ షోలో అనసూయ యాంకర్ అని, ఆమె అద్భుతమైన యాంకర్ అని చెప్పాడు నాగబాబు. నిజానికి తనతో పాటు రోజా కూడా 25 ఎపిసోడ్స్ అనుకుని వచ్చాం కానీ.. శ్యామ్ ప్రసాద్ అదృష్టమా.. ఈటీవీ అదృష్టమా.. లేదంటే తమ అదృష్టమా తెలియదు కానీ తొలి ఎపిసోడ్‌కే బ్లాక్ బస్టర్ అయిపోయి.. బెస్ట్ టీఆర్పీ వచ్చిందని చెప్పాడు నాగబాబు. తర్వాత అది 10 నుంచి 15 వరకు టీఆర్పీ వచ్చిందని.. అలా ఏడేళ్ల పాటు కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు ఈయన. అదుర్స్ కోసం లక్షలు ఖర్చు చేసినా రాని టిఆర్పీ జబర్దస్త్ కామెడీ షోకు వచ్చిందని.. అప్పుడే తాను శ్యామ్ వాళ్ల అమ్మాయి దీప్తికి కూడా చెప్పినట్లు తెలిపాడు నాగబాబు. అప్పట్లో రాకెట్ రాఘవ, రోలర్ రఘు, ధనరాజ్, చంటి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లతో మొదలైందని.. మధ్యలో వాళ్ల బిజీ కారణంగా కావచ్చు.. పర్సనల్ కారణాల వల్ల కావచ్చు కొందరు ఎగ్జిట్ అయిపోయారని చెప్పాడు.

తర్వాత సుధీర్, షకలక శంకర్ లాంటి వాళ్లు టీం లీడర్స్ అయ్యారని.. అలా ఇప్పుడు వాళ్లంతా స్టార్స్ అయ్యారని చెప్పాడు. ఇదంతా ఓవర్ నైట్ వచ్చింది కాదు ఎన్నో ఏళ్ల శ్రమ ఉందంటున్నాడు నాగబాబు. ఈ జబర్దస్త్ కాన్సెప్ట్ చెప్పింది డైరెక్టర్ సంజీవ్ అని, ఆయన దగ్గర ఉన్న ఇద్దరు కుర్రాళ్లు నితిన్ భరత్… నాగబాబు. రానురాను వాళ్లే షోను నడిపించే స్థాయికి ఎదిగారని, వాళ్లకు క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉందని పొగిడాడు. వాళ్ల పొజిషన్ కంటే కూడా ఎక్కువ పని చేసారని గుర్తు చేసుకున్నాడు. తర్వాత అనసూయ తప్పుకోవడం, రష్మి రావడం.. ఇలా జబర్దస్త్ షోలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు నాగబాబు. ఈ వీడియోలో ఇన్ని ఆసక్తికర విషయాలు చెప్పి ముగించాడు నాగబాబు. 

Related posts