టిడిపి అంటే బిసిల పార్టీ అని..నాతో పాటు 60 శాతం పొలిట్ బ్యూరో పదవులు బీసీలకు కేటాయించారని అచ్చెన్నాయుడు అన్నారు. టిడిపిని అధికారంలోకి తెచ్చేవరకు కాళ్లకు గజ్జెకట్టి తిరుగుతామని..పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేరుస్తామని పేర్కొన్నారు. బిసిలకు ఎక్కువ శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని జగన్ గొప్పలు చెబుతున్నారని..ఆ పదవులు నాలుక గీచుకోవటానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పిన దానికి తలూపటానికే పెదవులని..కింజరాపు కుటుంబంపై చంద్రబాబు, లోకేష్ పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. బలహీన వర్గాలను చైతన్య పరిచి ఏకం చేస్తానని..ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగతానని పేర్కొన్నారు. తనకు దక్కిన హోదా బలహీన వర్గాలకు దక్కిన గౌరవం అని..టీడీపీ బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీకి పూర్వవైభవం తెచ్చి..చంద్రబాబును మళ్ళీ సీఎంగా గెలిపించేందుకు కృషి చేస్తానని అచ్చెన్న స్పష్టం చేశారు. బీసీలపై నమ్మకంతో పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెలిపారు అచ్చెన్నాయుడు.
previous post