telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మే ఒకటి నుంచి బుకింగ్.. మామిడి పండ్ల డోర్ డెలివరీ!

Mango fruits

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మార్కెట్లు సరిగ్గా తెరచుకోకపోవడంతో మామిడి పండ్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ, సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి, 5 కిలోల చొప్పున కార్టన్ బాక్స్ లలో ప్యాక్ చేసి, ప్రజలకు ఇంటి వద్ద డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు తపాలా శాఖ పార్శిల్ సర్వీస్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపింది.

మే 1వ తేదీ నుంచి మామిడిపళ్ల బుకింగ్స్ స్వీకరిస్తామని పేర్కొంది. 5 కిలోల బాక్స్ కు డెలివరీ చార్జీలను కలిపి రూ. 350 చెల్లించాలని, సుమారు 12 నుంచి 15 బంగినపల్లి కాయలు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలోపు 79977 24925 లేదా 79977 24944 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 4 నుంచి 5 రోజుల్లో డెలివరీ అందుతుందని తెలిపారు. మే 1వ తేదీ నుంచి బుకింగ్స్ స్వీకరిస్తామని పేర్కొన్నారు.

Related posts