telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మామిడి చెట్టు ఎక్కిన మంచు లక్ష్మి… వీడియో వైరల్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరమితమయ్యారు. లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలు మాత్రం ఇంట్లో చేసే పనులు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడూ షూటింగ్స్‌తో హడావిడిగావుండే వీరు కుటుంబానికి సమయం కేటాయించింది తక్కువే ఉంటుంది. కొంతమంది వంటలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఛాలెంజ్‌లు విసురుతూ తమ విధి నిర్వహణను తెలియజేస్తున్నారు. ఇక లక్ష్మీ మంచు అయితే ఏకంగా చెట్లు కూడా ఎక్కేస్తుంది. ఇటీవల తన గారాల పట్టి విద్యా నిర్వాణ మామిడి కాయలు అడిగితె తన ఇంటి ముందున్న మామిడి చెట్టు ఎక్కి మరీ విద్యాకి ఇచ్చింది. అయితే ఈ చెట్టు తమ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నా ఏ రోజూ దానిని పలకరించలేదని. లాక్‌డౌన్‌లో ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న ప్రతి చెట్టుని పలకరిస్తున్నా అని చెప్పుకొచ్చింది లక్ష్మీ.

Related posts