telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ తో ఓ వ్యక్తి హాల్ చల్….

హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ తో ఓ వ్యక్తి హాల్ చల్ చేసాడు. డబీర్ పురా కి చెందిన ఆయుబ్ ఖాన్ మరో వ్యక్తి నిందితుడు జకీర్… డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీ కేఫ్ లో కూర్చొని టి తాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య కేవలం 3వేల రూపాయల వివాదం తో జకీర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీ తో మరో వ్యక్తి ఆయుబ్ ఖాన్ ని బెదిరించడం తో గన్ లోడ్ చేసి కాల్పులకు సిద్ధపడ్డాడు ఉలిక్కిపడ్డ హోటల్ లోని కస్టమర్లు మరియు హోటల్ యజమాని వారి గోడవను నిర్వరిస్తూ డబీర్ పురా పోలీసులకు సమాచారం ఇచ్చారు… వెంటనే రంగం లోకి దిగిన డబీర్ పురా పోలీసులు జకీర్ ను అదుపులోకి తీసుకున్నారు…. మద్యం మత్తులో ఉన్న జకీర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి గన్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు వివరాలు సేకరిస్తున్నారు…. ఇద్దరు ఆయుబ్ ఖాన్ మరియు జకీర్ మధ్య ఓ భూవివాదం జరుగుతున్నట్లు అందులో భాగంగా ఈ గొడవ జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు డబీర్ పురా పోలీసులు.

Related posts