telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త !

exam hall

కరోనా నేపథ్యంలో CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారం లో కరోన పరిస్థితి లు సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది cbse బోర్డ్. కరోన కేసులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు…దీంతో ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి పెట్టింది cbse. అటు తెలంగాణ లో కూడా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన బోర్డ్… పరిస్థితి చక్కబడ్డాక వారికి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది బోర్డ్. ద్వితీయ సంవత్సరం పరీక్షల పై జూన్ మొదటి వారం లో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఇంటర్ అధికారులు..పరీక్షలు రద్దు అయితే ప్రత్యమ్నాయ మార్గాలు ఏంటని దాని పై ఇప్పటికే దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం మార్క్స్ వేయాలని ఆలోచన చేస్తోంది. పరీక్షలు రద్దు అయితే ఈ విధానం ద్వారానే విద్యార్థుల రిజల్ట్స్ ప్రకటించనుంది ఇంటర్ బోర్డ్. లాబ్ రికార్డ్స్ ఆదరంగా ప్రాక్టీకల్స్ మార్క్స్ వేయాలని ఇప్పటికే నిర్ణయించింది ఇంటర్ బోర్డ్…

Related posts