telugu navyamedia
సినిమా వార్తలు

విమానంలో సామ్-చై ఫోటో వైరల్… “మజిలీ” మూడు రోజుల కలెక్షన్స్

Majili

శివ నిర్వాణ డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా, షైన్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన సినిమా మజిలీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న శుక్రవారం రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటిరోజు రూ.7 కోట్లకు పైగా కలక్షన్లు సాధించిన ఈ సినిమా రెండు రోజులకు రూ.20 కోట్లు రాబట్టింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల కలెక్షన్స్ తో రూ.21 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో మూడు రోజులకు ఈ సినిమా రూ.5.91 కోట్ల షేర్ ని రాబట్టింది. ప్రస్తుతం “మజిలీ”కి పోటీగా ఏ సినిమాలు లేకపోవడం కలిసొచ్చింది. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటించిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు సిని ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక ఈ సినిమా హిట్ తో ఆనందంగా ఉన్న స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతల తాజా ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండిగో విమానంలో వీరిద్దరూ వెళుతున్న సమయంలో… చైతూ తన ల్యాప్ టాప్ చూసుకుంటూ బిజీగా ఉన్న వేళ, సమంత తన భర్త భుజంపై తల పెట్టి నిద్రిస్తున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసిన సమంత “ఆఖరికి.. ఏదీ దీనికి సాటి రాదు” అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

 

View this post on Instagram

 

In the end … nothing else matters ❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts