telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతు లేఖ ప్రభావం.. రంగంలోకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ .. నష్టాలపై నివేదికలు..

maharastra cm fadnavis on floods

మహారాష్ట్ర లో బీజేపీ, శివసేన పార్టీల మధ్య సయోధ్య ఇంకా కుదర లేదు. ఒకవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పాటు అంశం తేలకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఆపద్ధర్మ సీఎం ఫడ్నవీస్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. వరదలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు పంట నష్టంపై నివేదికలు సమర్పించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పంటల పరిస్థితిపై సీఎం ఫడ్నవీస్ కలెక్టర్లు, వాతావరణశాఖ అధికారులతో చర్చించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతోపాటు బీమాను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు.

క్యార్రా తుపాన్ వల్ల గత రెండు వారాలుగా కురుస్తున్న భారీవర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం నాటి సమావేశంలో రైతులకు నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది.కాగా నవంబరు 9వ తేదీతో పాత శాసనసభ కాలపరిమితి ముగిసిపోతుంది. ఆలోగా కొత్త శాసనసభ కొలువుదీరాలి. అక్టోబరు 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, 23న ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ, శివసేన కూటమికి సాధారణ మెజారిటీ వచ్చినప్పటికీ సీఎం పదవిని పంచుకొనే విషయమై బీజేపీ స్పష్టమైన హామీ ఇవ్వనందున ప్రభుత్వంలో చేరేందుకు శివసేన నిరాకరించింది. దాంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ ప్రతిష్ఠంభన ఇలానే కొనసాగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Related posts