telugu navyamedia
సినిమా వార్తలు

“మా” రచ్చ : నరేష్ ప్రమాణ స్వీకారానికి శివాజీరాజా మెలిక

Sivajiraja

ఇటీవల జరిగిన “మా” – మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ పోటీ పడ్డారు. అందులో ఎక్కువ ఓట్లతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ “మా” అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో శివాజీరాజా ఓ కొత్త మెలిక పెట్టారట.

సాధారణంగా ఓ కమిటీ ఎన్నికల కాల పరిమితి దగ్గరకు వచ్చిన తరువాతనే ఎన్నికలు జరుపుతారు. అంటే ఇంకా అధికారంలో ఉన్న కమిటీ కాలపరిమితి ముగియకముందే ఈ ఎన్నికలు జరుపుతారన్నమాట. అధికారంలో ఉన్న పార్టీనే ఎన్నికల్లో గెలిస్తే సమస్య ఉండదు. కానీ కొత్త పార్టీ గెలిస్తేనే సమస్య. ఇంకా అధికారంలో ఉన్న కమిటీకి కాలపరిమితి ఉన్నా కూడా పక్కకు తప్పుకొని కొత్త కమిటీకి అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు “మా”లో అలా జరగడం లేదట. తమ కమిటీకి ఉన్న కాలపరిమితి ముగిసేవరకూ తామే రూల్ చేస్తామని, ఆ తరువాతే కొత్త కమిటీ రావాలని అంటున్నారట శివాజీరాజా. ఒకవేళ అలా కాకుండా ప్రమాణ స్వీకారం చేస్తే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన హెచ్చరించారట. ఈ విషయం గురించే మీడియా సమావేశం పెట్టాలని చూస్తున్నారట నరేష్.

Related posts