telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సమంత గురించి కీర్తి సురేష్ ఏమందంటే..?

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ‘మహానటి’ సినిమాతో తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరించారు. ఈ చిత్రంతో ఆమె జాతీయ ఉత్తమనటిగా అవార్డు పొందింది. కీర్తి సురేష్ ఈ లాక్ డౌన్‌లో పెంగ్విన్ చిత్రంతో ఓటీటీలో బోణి కొట్టింది. కానీ ఈ చిత్రం అంతగా వర్కవుట్ కాలేదు. సినిమా యావరేజ్ అయిన కీర్తి సురేష్ నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మిస్ ఇండియా అంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా కీర్తి సురేష్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. మిస్ ఇండియా మూవీ రిలీజైన సందర్భంగా లైవ్ సెషన్ పెట్టింది. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఖుషీ చేసింది. ఇందులో భాగంగా నెటిజన్లు తమకు నచ్చిన ప్రశ్నలు అడగ్గా కీర్తి సురేష్ ఎంతో ఓపిగ్గా ఎంతో ప్రేమగా రిప్లై ఇచ్చింది. ఓ నెటిజన్.. సమంత గురించి ఒక్క మాటలో చెప్పండి..? అని అడగ్గా..!! సమంత గురించి ఒక్క మాట అంటే సరిపోదు.. ఆమె ఎంతో స్మార్ట్, ప్రయోగాలు చేసేందుకు ముందుంటుది.. ఎప్పుడూ ఎదుటివారిలో స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని కీర్తి సురేష్ పొగిడేసింది.

Related posts