telugu navyamedia
సినిమా వార్తలు

కౌశల్ కు షాకిచ్చిన “కౌశల్ ఆర్మీ”

kaushal

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ ఆయన పేరు మీదున్న ఆర్మీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. “కౌశల్ ఆర్మీ” కౌశల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మాటన్నా, గొడవ పడినా… వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. ఇక సోషల్ మీడియాలో అయితే కౌశల్ ఆర్మీ, కౌశల్ యాంటీ ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చ జరిగేది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కౌశల్ ఆర్మీ స్వయంగా కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ ఓ ఇంటర్వ్యూలో కౌశల్ గురించి చెప్పిన విషయాలు అందరికి షాకిస్తున్నాయి.

కౌశల్ కు డబ్బు పిచ్చి ఉందని, డబ్బు లేకపోతే అభిమానులను కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా ఖర్చును మాత్రం కౌశల్ ఆర్మీనే భరించాల్సి వచ్చేదని, అభిమానులు తమ డబ్బులతోనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని చెప్పారు ఇమామ్. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును ఫౌండేషన్ కు వినియోగిస్తానని కౌశల్ చెప్పిన మాటలు అబద్ధమని, ఆయనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సింపతీ క్రియేట్ చేస్తూ మానిప్యులేట్ చేస్తాడని, బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కారణంగా 16 మంది హౌస్ మేట్స్ ఇబ్బంది పడుతుంటే అర్థం కాలేదని, అభిమానులను కౌశల్ బలి పశువులను చేశాడని, ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.

Related posts