telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అజయ్ చాందని మృతి

Ajay-Chandani

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బెంగుళూరు వసంత్ నగర్ లో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఆయనకు భార్యా, కుమార్తె ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే… సోమవారం సాయింత్రం ఏడున్నర లక్షల విలువైన తన కొత్త బైక్ సుజికి వో స్ట్రోమ్ 650 XT పై బయలు దేరిన ఆయన బైక్ పై అతివేగంగా కొంత దూరం వెళ్ళగానే ఒక మలుపు రావడం, ఆ మలుపులో అదే స్పీడ్ తో వెళ్తుండగా, అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేకపోవటంతో మలుపు దగ్గర ఉన్న వాల్ ని గుద్దేసి ఉంటారని పోలీస్ లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపట్లోనే దగ్గరలో ఉన్న జైన్ హాస్పటిల్ కు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయటంతో కన్నడ ఇండస్ట్రీలో అజయ్ కు మంచి పేరుంది. అజయ్ తండ్రి కన్నడ పరిశ్రమలో హిందీ సినిమాలకు పేరున్న డిస్ట్రిబ్యూటర్. దాంతో సుదీప్ తో సహా మరికొందరు హీరోలు, నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేశారు.

Related posts