telugu navyamedia
సినిమా వార్తలు

“రావణ”గా నందమూరి హీరో

Kalyan Ram 118 Movie Release

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన “118” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తన తదుపరి సినిమా విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన తదుపరి చిత్రం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో వున్నారు. ఈ సినిమాకి “తుగ్లక్” అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఈ టైటిల్ కథకి తగినట్టుగా అనిపించడం లేదని యూనిట్ భావించడంతో కథకి తగినట్టుగా పవర్ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. దీంతో “రావణ” అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

Related posts