telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కాలే .. దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు …

kale and its health benefits

ఆకుపచ్చ కూరగాయాలు మన శరీరానికి ఎంతో శ్రేయస్కరం. అందులోను కొన్నిటి వలన ప్రయోజనాలు అనేకం ఉంటాయి. వాటిని ఆహారంలో చేర్చుకోవాలి, అది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందులో కాలే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలలో ఒకటి (బ్రసికాసియే). ఇది శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన, ప్రపంచంలోని గొప్ప పోషకభరితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. ఇది తక్కువ కొవ్వు పదార్ధాలను మరియు తక్కువ కాలరీలను కలిగి ఉండి, పోషకాలలో అధికంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడుకుని పోషకభరితమైన ఆహారంగా ఉంటుంది.

కాలేలో పోషకాలు మరియు ఫ్లేవర్ల స్వల్ప తేడాలతో కూడుకుని అనేక రకాలుగా లభిస్తుంటాయి. వాటిలో కొన్ని :

  • కర్లీ కాలే – ఇది సాధారణంగా లభించే కాలే రకం, ఇది సామాన్యంగా ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉంటుంది. ఆకులు ఎక్కువగా ముడతలు పడినట్లుగా కనిపిస్తుంటాయి. కాలే చిప్స్ తయారీకి వీటిని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంటుంది.
  • రెడ్ రష్యన్ కాలే – ఈ రకానికి చెందిన ఆకులు తీపి మరియు పులుపు రుచిని కూడుకుని ఉంటాయి. ఈ కాలే కాండం కొద్దిగా ఊదా రంగులో ఉంటుంది. మరియు ఆకులు ఎర్రటి ఛాయతో ఉంటాయి. ఆకులు దాదాపు ఓక్ ఆకులను పోలి ఉంటాయి. సలాడ్లు, జ్యూసులు మరియు, సాండ్ విచ్ తయారీకి రెడ్ రష్యన్ కాలే వినియోగించడం జరుగుతుంది.

kale and its health benefitsaకాలేలో పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల పచ్చి కాలేలో 89.63 గ్రాముల నీరు మరియు 35 కిలో కాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా, 2.92 g ప్రోటీన్, 1.49 g లిపిడ్ (fat), 4.42 g కార్బోహైడ్రేట్స్, 4.1 g ఫైబర్, 0.99 g చక్కెర, 254 mg కాల్షియం, 1.60 mg ఇనుము, 33 mg మెగ్నీషియం, 55 mg భాస్వరం, 348 mg పొటాషియం, 53 mg సోడియం, 0.39 mg జింక్, 93.4 mg విటమిన్ C, 0.113 mg థయామిన్, 0.347 mg రిబోఫ్లోవిన్, 1.180 mg నియాసిన్, 0.147 mg విటమిన్ B6, 62 mcg ఫోలేట్, 4812 ఐయు విటమిన్ ఎ, 0.66 mg విటమిన్ ఇ, 389.6 mcg విటమిన్ k ఉంటాయి.

ఇక ఇది తీసుకోవడం వలన గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, అధిక బరువు, రోగనిరోధక శక్తి, కాన్సర్ నివారణ, కంటి సమస్యలకు, ఎముకల పటుత్వానికి, మధుమేహం, చర్మం సంబంధిత సమస్యలు, జుట్టు  సమస్యలు వంటి అనేక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

అయితే ఏదైనా అతి ప్రమాదమే కాబట్టి, ఇది కూడా అధికమోతాదులో తీసుకుంటే దుష్ఫలితాలు తప్పవంటున్నారు నిపుణులు.

Related posts