తనవైన సోయగాలతో కుర్రకారు మనసుల్ని దోచేసింది కాజల్ అగర్వాల్. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్‌కి పెళ్లైతే ఆమెకు ఆఫర్లు తగ్గుతాయి. ఈ అమ్మడు విషయంలో మాత్రం అలా జరగలేదు. కొన్నాళ్ల పాటు స్నేహితుడు, బెజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూతో ప్రేమాయణం సాగించిన తరువాత ఎట్టకేలకు గతేడాది ఆగస్టు 30న వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయ్యే సమయానికి చిరంజీవి సరసన ఆచార్య సినిమా చేస్తుంది. ఇదే అమ్మడి ఆఖరి చిత్రం ఇక మీదట అమ్మడుకి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని భావించారు. కానీ ఈ అమ్మడు విషయంలో అంతా తారుమారైంది. ప్రస్తుతం ఈ అమ్మడు చాలా బిజీగా గడుపుతోంది. తాజాగా అందల భామ కాజల్ అగర్వాల్, ప్రభుదేవా కాంబోలో ఓ తమిళ సినిమా చేయబోతున్నారట. ఈ మూవీ రొమాంటిక్, కామెడీ బ్యాగ్ గ్రౌండ్‌తో తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే.. ఈ సినిమాను కళ్యాణ్ డైరెక్షన్ చేస్తున్నాడట. ఈ మూవీ పూర్తి వివరాలను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకు ముందు డీకే దర్శకత్వంలో హారర్ సినిమాలో కాజల్, ప్రభుదేవా జంటగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు ప్రకటించాక చిత్ర బృందం నుంచి ఇప్పటి దాకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
previous post