telugu navyamedia
political trending

విజయవాడలో.. అంతర్జాతీయ ఇంధన సదస్సు..

another 7 five star hotels in amaravati

ఏపీ రాజధానిగా, అమరావతి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమరావతిలో నెలకొల్పేందుకు పారిశ్రామికి వేత్తలు ముందుకు రావడమే కాకుండా, అమరావతిలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ వేదికగా నేటి రెండు రోజుల పాటు అంతర్జాతీయ ఇంధన సదస్సు జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా, నామమాత్రంగా నష్టాలు, గ్రీన్‌ ఎనర్జీ విధానంలో భాగంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి, గ్రామం యూనిట్‌గా సోలార్‌- విండ్‌ గ్రిడ్‌, సోలార్‌ వ్యవసాయ పంప్‌ సెట్లు తదితర అంశాలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నెడ్‌క్యాప్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డాల్‌బర్గ్‌, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, టీఈఆర్‌ఐల సహకారంతో ఈసదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. 300కు పైగా విద్యుత్‌ ఉత్పత్తి, పరికరాల తయారీ సంస్థల ప్రతినిధులూ పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

సాఫ్ట్‌ బ్యాంకు ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మనోజ్‌ కొహ్లి, రెన్యూ పవర్‌ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా, ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ డైరెక్టర్‌ అజయ్‌ మాథూర్‌, సుజ్లాన్‌ ఎండీ జేపీ చలసాని, చైర్మన్‌ తులసి తంటి, ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌కు చెందిన ఉపేంద్ర త్రిపాఠి, ఆసియన్‌ డల్‌బెర్గ్‌ అడ్వయిజర్స్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్త తదితర పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు.

Related posts

సూప‌ర్ హిట్ అయితే లేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయొద్దు… : నాని

vimala p

దిల్లీ : …పట్టాలెక్కనున్న .. రెండో ప్రైవేట్ రైలు..

vimala p

పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్

vimala p