telugu navyamedia
సినిమా వార్తలు

ఓ ప్రియా . . . ! 

virikanne bhama poetry corner

ఓ ప్రియా . . ! 
నీ కనులు వెన్నెల జలపాతాలు 
నీ పెదవులు తియ్యని మధు పాత్రలు 
నీ బుగ్గలు ఎర్రని గులాబీ మొగ్గలు
నీ నడకలు హంసమ్మ కులుకులు 
నీ పలుకులు తేనెచినుకులు 
నీ చూపులు విరి బాణాలు 
నీ ముఖార విందంచంద్రబింబం
నీ సౌందర్యం అతిలోక సుందరం 

ఓ ప్రియా. . . ! 
నీ  చూపుల వలలో నే చిక్కుకున్నా
నా గుండె గుడిలో నిన్ను ప్రతిష్ఠించుకున్నా
నిత్యం పూజిస్తున్నా
నీ నామం జపిస్తున్నా
నీ ప్రేమకై తపిస్తున్నా

ఓ ప్రియా . . ! 
నా కోసం వస్తావు కదూ ! 
నన్ను కరుణిస్తావు కదూ ! 
నా ప్రేమను అంగీకరిస్తావు కదూ ! 

ఓ ప్రియా. . ! 
నీవే నా  ధ్యానం 
నీవే నా సర్వం 
నీవే నా ప్రాణం ! 
నీతోనే నా జీవితం ! 

– పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts