telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

భారత్ పై .. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మండిపాటు..క్రీడలు వేరు, తీవ్రవాదం వేరు అంటూ కొత్త పాట.. !!

internation olympic committee on india

పుల్వామా ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణానికి తెరలేపింది. దీనితో ఆ దేశంతో సర్వసంబందాలు తెంచేసుకోడానికి భారత్ సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఒలంపిక్స్ కోసం పాక్ ఆటగాళ్లను దేశంలోకి రానివ్వకపోవటంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మండిపడింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాక్ షూటర్లకు భారత్, వీసాలు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐవోసీ… భారత్‌ నిర్ణయంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై ఇండియాతో చర్చలు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది.

ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌ తీరును తప్పుబట్టిన ఐవోసీ… అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలంది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపరాదని, ఆ దేశ రాజకీయ జోక్యం కూడా ఉండ కూడదని స్పష్టం చేసింది. ఇండియా ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినదుకే ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. ఇకపై ఒలింపిక్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాల పోటీదారులకు అనుమతి ఇస్తామని భారత సర్కార్ నుంచి లిఖితపూర్వకమైన హామీ వచ్చేంత వరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ.

Related posts