telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

ఈ వస్త్రం ఉంటే చాలు… బాండ్ ఎయిడ్ లు అవసరం లేదట..!

Electric-Cloth

గాయాలను త్వరగా మాన్పే ఎలక్ట్రిక్‌ వస్త్రాన్ని అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు రూపొందించారు. గాయంపై ఈ వస్త్రాన్ని చుట్టడం ద్వారా దీనిలోని ఎలక్ట్రిక్‌ ఫీల్డ్‌ బ్యాక్టీరియల్‌ బయోఫిల్మ్‌ ఇన్‌ఫెక్షన్‌ను దరిచేరనివ్వదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలిన లేదా శస్త్రచికిత్సల అనంతరం అయ్యే గాయాలపై ఈ వస్త్రాన్ని చుట్టడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చన్నారు. బ్యాక్టీరియాను నిరోధించడం ద్వారా గాయాలు సత్వరమే మానేలా చూడవచ్చని తెలిపారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన చందన్‌ సేన్‌, శేషావతి రాయ్‌లు ఈ వస్ర్త్రాన్ని రూపొందించారు.

Related posts