telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సాంకేతిక

ఐగురు యాప్ తో .. అందరికి ప్రయోజనం.. డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృష్ణ..

iguru app for paper less work by dr.harshavardhan

పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవల్లోనూ ముందున్నారు ఈ డాక్టర్. అయినా ఆయనలో ఏదో వెలితి. తాను పుట్టిన గడ్డకు.. ఇక్కడి సమాజానికి సేవ చేయాలని పరితపించి తిరిగి భారత దేశం వచేంచశారు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న ఆయన పర్యావరణానికి మేలు చేసేందుకు ‘పేపర్‌’ వినియోగాన్ని తగ్గించాలను నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దాదాపు అన్ని విధులకు ఉపయోగపడేలా సౌకర్యాలు, హుంగులతో సరికొత్త యాప్‌కు శ్రీకారం చుట్టారు నగరానికి చెందిన డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృష్ణ. మహబూబ్‌నగర్‌ జిల్లా తాండ్ర గ్రామం. ఉస్మానియాలో ఎంబీబీఎస్‌ చేశారు. విదేశాల్లో 25 సంవత్సరాలు డాక్టర్‌గా సేవలందించారు.

స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ఇనిస్టిట్యూషన్స్‌లో పేపర్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేలా అన్ని సౌకర్యాలతో ఐగురు యాప్‌ రూపకల్పన చేశాం. విద్యార్థులకు కాకుండా పేరెంట్స్‌కు ఈ యాప్‌ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. స్కూల్‌కు వెళుతూ, తిగిచి వచ్చే పిల్లలు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా యాప్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు యాప్‌ ద్వారా క్షణాల్లో సెలవును తీసుకోవచ్చు. పేరెంట్స్‌కు సింహభాగంగా పెద్దపీట వేసే విధంగా అన్ని హంగులతో యాప్‌ను తయారు చేసి పేపర్‌లెస్‌ గో గ్రీన్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు అందించాం. సామాజిక దృక్పథంతో స్కూల్స్, కాలేజీలకు ఏడాది పాటు ఉచితంగా యాప్‌ను అందించాం. వందలాది స్కూల్స్‌కు యాప్‌ను ఎలా వాడాలో తెలిపే టీమ్‌తో వారికి అవగాహన కల్పించాం. యాప్‌ను వాడిన ఇనిస్టిట్యూషన్స్‌ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏడాది తర్వాత కేవలం మెయింటనెన్స్‌ కోసం ఒక్కో విద్యార్థికి చాలా తక్కువ ఫీజుతో ఈ యాప్‌ను ఇనిస్టిట్యూషన్స్‌కు అందిస్తున్నాం. ఐ-గురు యాప్‌ వాడిన పేరెంట్స్‌ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను డాక్టర్‌గా పనిచేసినా ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ పని చాలా సంతృప్తినిస్తోందని డాక్టర్ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related posts