telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ట్రిపుల్ తలాక్ : .. నిన్న బిల్ పాస్ .. అంతలోనే డబ్బులు ఇవ్వలేదని …

husband triple talaq with stupid reason

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ చేసుకొని మొత్తానికి గెలిచింది బీజేపీ. ఇందులో భాగంగానే ట్రిపుల తలాక్‌ను నిషేదించేందుకు ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఒత్తిడికి తలోగ్గకుండా మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును అమల్లోకి తెచ్చింది. అయితే మోడీ ప్రతిష్టాత్మకంగా బిల్లును తీసుకువచ్చిన మరుసరి రోజే ఆయన ఇలాక అయిన గుజరాత్‌లో ఓ ముస్లిం మహిళకు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువచ్చి, పార్లమెంట్‌లో సైతం పాస్ చేయించిన నేపథ్యంలోనే ఆయన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో తన భర్త అడిగిన డబ్బులు ఇవ్వనందుకు బయటకు నెట్టి ట్రిపుల్ తలాక్ చెప్పాడని భార్య ఆత్మహత్య చేసుకుంది.

దీంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న యువతి తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాధు చేశారు. లోన్‌ తీసుకునేందుకు మహిళకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను భర్త అడిగాడని, దానికి నిరాకరించడంతో త్రిపుల్ తలాక్ చెప్పినట్టు పిర్యాధు చేసిందని స్థానిక పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం అది ట్రిపుల్ తలాక్ కేసు అవుతుందా కాదా అనే పరీశీలించిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ కేసు నమోదు అయిన వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.

Related posts