telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హుజూర్ నగర్ : .. ఉపఎన్నికకు.. భారీస్థాయిలో నామినేషన్లు..

utham resigned as mla

బీసీ సంఘాలు, స్థానిక నిరుపేదలు హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినట్లుగా వీరు కూడా చేయనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్క ఉపఎన్నిక అనివార్యమైంది.

బీసీల రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో బీసీ సంఘాలు, మోడల్‌ కాలనీ నిర్మాణానికి సంబంధించి స్థానికులు తమ సమస్య పరిష్కారానికి ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 34శాతం నుంచి 24శాతానికి తగ్గించడంపై ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు.. తిరిగి 34 శాతం రిజర్వేషన్‌ కోసం భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలో 200 మంది బీసీలతో నామినేషన్లు వేయిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఇప్పటికే ప్రకటించారు. స్థానికంగా మోడల్‌ కాలనీ కోసం నిరుపేదలు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

స్థానికంగా 20 ఏళ్లుగా ఇళ్లు లేక రోడ్ల వెంట, ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ కట్టలపై నివాసముంటున్న పేదలకు.. గూడు కల్పించే ఉద్దేశంతో మోడల్‌కాలనీ పేరిట పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద రూ.150 కోట్లతో వీరికి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే రాజకీయ కారణాలతో ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో నిరుపేద కుటుంబాల ప్రజలు ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ఉప ఎన్నికల్లో 300 మందికి తగ్గకుండా నామినేషన్లు వేసేందుకు సిద్దమయ్యారు.

Related posts