telugu navyamedia
andhra crime culture news trending

రాబోయే రెండు రోజులు భానుడి భగ భగ!

this summer exceeds 47 degress and more

రాబోయే రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలునమోదయ్యే అవకాశం ఉందని, వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందినట్టు కడప కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

గొడుగు, టోపీ, లేదంటే తలపై వస్త్రం కప్పుకోకుండా బయటకు రావొద్దన్నారు. వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రాకపోవడమే మంచిదన్నారు. ముఖ్యంగా వృద్దులు,పిల్లలు రక్షణ లేకుండా బయటకు రాకూడదన్నారు. ధార్మిక సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు వీలైనంత వరకు చలివేంద్రాలుఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాలు అయిన ఆసుపత్రిలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో సంబంధిత సంస్థలు నీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సంబంధిత మందులు, అంబులెన్సులు సిద్ధంగా ఉండాలని వైద్యఆరోగ్య శాఖను ఆదేశించారు.

Related posts

ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు

vimala p

నాపై విమర్శలు చేయడం మానుకోవాలి: చంద్రబాబు

vimala p

శ్రీకాకుళం : .. ఏపీసీఎం పర్యటన .. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ..

vimala p