telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

దోసకాయ, సొరకాయలతో ఈ రోగాలు దగ్గరికీ కూడా రావు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఎన్ని అటంకాలు వచ్చినా…మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మనం ఆరోగ్యం బాగుంటే ఎదైనా చేయగలం. ఇవాళ కొన్ని ఆరోగ్య చిట్కాలు చూద్దాం.

దోసకాయ…
దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం లేకుండా విరేచనము సాఫీగా అవాలంటే దోసకాయను తరుచు భుజించాలి. దోసగింజలను ఎండబెట్టి తింటుంటే చాలా మంచిది. ముఖ సౌందర్యానికి, చర్మ రక్షణకు, ముఖం కాంతివంతంగా వుండేందుకు దోసకాయలను చిన్నబద్దలుగా కోసి ముఖానికి, చర్మానికి రుద్దుకోవాలి.

సొరకాయ…
సొరకాయ జలుబు చేస్తుందని చాలమంది తినరు. కాని అది వట్టి అపోహ మాత్రమే. ఇది జలుబుతో పాటు, కఫాన్ని కూడా తగ్గిస్తుంది. సొరకాయలో బాగా చలువ చేసే గుణం కలదు. కడుపులో మంటని అతి దాహాన్ని సొరకాయ తగ్గిస్తుంది. అరికాళ్ళు పగిలినచోట సొరకాయగుజ్జును రాసి మృదువుగా మర్దనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.
సొరకాయ ముక్కలను తింటే దగ్గు రాకుండా, కఫం లేకుండా చేస్తుంది. సొరకాయ గర్భస్రావాన్ని కలిగించే గుణం కలది కాబట్టి దీన్ని గర్భిణిలు తినకుండా వుండటం మంచిది.

Related posts