telugu navyamedia
సామాజిక

ఎదిగి ఒదిగిన అసామాన్యుడు కేవీ బ్రహ్మం

HBD KV BRAHMAM
ఈరోజు కేవీ బ్రహ్మం పుట్టినరోజు విద్యా రంగంలో కేవీ బ్రహ్మం చేసిన సేవలు, అందించిన ప్రోత్సహం ఆ రంగం పట్ల ఆయనకున్న అభిరుచి, అభిమానాన్ని తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. విద్యారంగంలో ఆయనొక రోల్ మోడల్ గా చెప్పవచ్చు. 
HBD KV BRAHMAM
బ్రహ్మం టాలెంట్ హై స్కూల్, బ్రెయిన్ ఫీడ్ ఇంగ్లీష్ మాస పత్రిక, నవ్య మీడియా వెబ్ సైట్ అన్నీ కేవీ బ్రహ్మం వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో మధ్య  తరగతి కుటుంబంలో జన్మించిన బ్రహ్మం చదువు తరువాత కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో మాథ్స్ టీచర్ గా జీవితం ప్రారంభించాడు. అన్ని సబ్జక్ట్స్ లో మాథ్స్ అంటే ఆయనకు అమితమైన ఇష్టం… అదే ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 
HBD KV BRAHMAM
అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటి దగ్గర పిల్లలకు మాథ్స్ చెప్పడం మొదలు పెట్టాడు. అనతి కాలంలోనే పిల్లల సంఖ్య పెరగడంతో పాటు పేరు కూడా వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకించి ఓ ఇల్లు తీసుకోవలసి వచ్చింది. ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అంటారు. ఆ మాటలు బ్రహ్మం  విషయంలో నిజమయ్యాయి. ఆయన పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలో బదిలీలు ఉంటాయి. బ్రహ్మాన్ని కూడా బదిలీ చేశారు. అప్పటికే వివాహం, కుమారుడు వున్న బ్రహ్మం ఉత్తరాదికి వెళ్లడం ఇష్టం లేదు… అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి, తనకిష్టమైన విద్యా రంగంలోనే తన జీవితాన్ని మలుచుకోవాలనుకున్నాడు. 
HBD KV BRAHMAM
అప్పటికే టీచర్ గా మంచి పేరు వచ్చింది. అప్పుడు “బ్రహ్మం టాలెంట్ స్కూల్”ను ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఈ స్కూల్ ఫలితాల్లో కార్పొరేట్ స్కూల్స్ తో పోటీపడటం మొదలు పెట్టింది. తెలంగాణ విద్యా రంగంలో గౌరవ స్థానం వున్న చుక్కా రామయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలసి విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ తయారు చెయ్యడం మొదలుపెట్టారు.  
HBD KV BRAHMAM
ఇది చాలదు అనిపించింది… అందుకే దేశంలో వున్న విద్యార్థులు, విద్యా వెతల కోసం “బ్రెయిన్ ఫీడ్” అనే ఇంగ్లీష్ మాస పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక ను దేశంలోని పెద్ద స్కూల్స్ అన్నీ ఆదరించడంతో విద్యారంగంలోని నిష్ణాతులతో సమావేశాలు, అర్హులైన వారికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టాడు. దేశంలోనే కాదు విధానాల్లో కూడా “బ్రెయిన్ ఫీడ్ ” ఖ్యాతిని పెంచాడు. 
HBD KV BRAHMAM
బ్రెయిన్ ఫీడ్ ద్వారా తన మామనసులో వున్న ఆలోచనలు అమలు చెయ్యడం మొదలు పెట్టాడు. మిత్రులు నర్రా వెంకట రావు, కుమార్, శివ కుమార్ , Dr. రఘు బాబు, ఉమా మల్లాది (NRI), బాలాజీతో కలసి “నవ్య మీడియా” వెబ్ సైట్ ను ప్రారంభించాడు. దీని లోగోను నాటి కేంద్ర సంచార మంత్రి, నేటి ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు. ఇలా బహు ముఖాలుగా ఎదిగిన బ్రహ్మం ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉంటాడు. 
HBD KV BRAHMAM
ఒక వ్యక్తిగా ప్రారంభమై… ఈరోజు వ్యవస్థ గా మారడం వెనుక అసమామైన కృషి, అద్వితీయమైన ఆలోచన వున్నాయి. అవే ఆయన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కేవీ బ్రహ్మం గారికి నవ్య మీడియా, సినీ నటులు బొడ్డు రాజాబాబు  జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

Related posts