telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ ను విలన్ గా మారుస్తున్న దర్శకుడు

Trivikram

“నా పేరు సూర్య” చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూసిన అల్లు అర్జున్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను చేయబోతున్నారు. అందులో ముందుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కింది. “అరవింద సమేత”తో హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు “అలకనంద” అనే టైటిల్ విన్పిస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్ గా పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్‌తో ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. గ‌తంలో అల్లు అర్జున్‌తో “దేశ‌ముదురు”లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హ‌న్సిక ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో వరుస సినిమాలు చేస్తున్న హ‌న్సికకు త్రివిక్ర‌మ్‌ ఈ పాత్ర గురించి చెప్పార‌ట‌. పాత్ర బాగా న‌చ్చ‌డంతో హ‌న్సిక ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మై చిత్ర‌బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Related posts