telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చాణక్య” మా వ్యూ

Chanakya

బ్యాన‌ర్‌ : ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు : గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనాఖాన్‌, నాజర్‌, జ‌య్ర‌ప‌కాశ్‌, సునీల్‌, అలీ, ర‌ఘుబాబు త‌దిత‌రులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తిరు
సంగీతం : విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ : వెట్రి ప‌ళ‌నిస్వామి
ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

టాలీవుడ్ లో చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల జాబితాలో మాచో హీరో గోపీచంద్ కూడా ఉన్నాడు. “జిల్” తరువాత ఈ యంగ్ హీరో హాట్ అనే మాటకు దూరమయ్యాడు. తాజాగా దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ “చాణక్య” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా గోపీచంద్ కు హిట్ ను ఇచ్చిందా ? లేదో చూద్దాము.

క‌థ‌:
రా ర‌హ‌స్యాలు తెలిసిన ఓ టెర్రిరిస్ట్‌ను స్నేహితుల సాయంతో ప‌ట్టుకుని చంపేస్తాడు రామ‌కృష్ణ అలియాస్ అర్జున్‌ (గోపీచంద్‌) రా ఏజెంట్‌. త‌న స్నేహితుల‌తో క‌లిసి సీక్రెట్ ఆప‌రేష‌న్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో టెర్ర‌రిస్ట్ నాయ‌కుడు ఖురేషి (రాజేష్ క‌తార్‌) ఇండియాను ప్ర‌పంచ దేశాల ముందు దోషిగా నిల‌బెట్ట‌డానికి ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్‌లో భాగంగా అర్జున్ స్నేహితుల‌ను కిడ్నాప్ చేస్తాడు. అంతేకాదు ద‌మ్ముంటే స్నేహితుల‌ను కాపాడుకోమ‌ని అర్జున్‌కి సవాల్ చేస్తాడు. అప్పుడు అర్జున్ తన స్నేహితులను కాపాడుకోగలిగాడా ? వాళ్ళను కాపాడడం కోసం అర్జున్ ఏం చేశాడు ? ఇందులో దేశానికి ఎలాంటి సమస్య ఎదురవుతుంది ? అసలు సోహైల్ ఎవరు ? తనకు ఎదురయ్యే సమస్యలను అర్జున్ ఎలా పరిష్కరిస్తారు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఈ సినిమాలో గోపీచంద్ రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలో కన్పిస్తాడు. అందులో బ్యాంక్ ఉద్యోగి రోల్ ఒక‌టి… రా ఏజెంట్ రోల్ ఒక‌టి. అయితే గోపీచంద్ మాత్రం రా ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్ష‌న్ సన్నివేశాల్లో గోపీచంద్ త‌న‌దైన స్టైల్లో మెప్పించాడునటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మెహ‌రీన్ పాత్రకు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. పాట‌ల‌కు మాత్ర‌మే పరిమితం అయ్యింది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ పాత్రకు మంచి ప్రాధాన్యతే దక్కింది. ఇక క‌మెడియ‌న్ సునీల్ పాత్ర‌కు కూడా ప్రాధాన్యత కన్పించదు. ఇక మిగతా నటీనటులంతా తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు తిరు తాను చెప్పదలచుకున్న పాయింట్ ను ప్రేక్షకులకు రీచ్ చేయలేకపోయాడేమో అన్పిస్తుంది. సినిమాలో చిన్న చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్ త‌ప్ప ఏమీ లేదు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్ట్ ఆక‌ట్టుకోదు. క్లైమాక్స్ చివ‌రి 15 నిమిషాలు బాగుంది. వెట్రి కెమెరావ‌ర్క్ బావుంది. పాట‌లు ఫరవాలేదు. రెండు మూడు చోట్ల డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇక సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts