telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ అమ్మాయి ఐదేళ్లుగా దేనితో రిలేషన్ షిప్ లో ఉందో తెలిస్తే…!!?

Girl

ఎవరైనా మనుషులను ప్రేమిస్తారు, పెళ్ళి చేసుకుంటారు… కానీ ఈ అమ్మాయి దేనిని ప్రేమించిందో తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే…! కానీ జర్మనీ, బెర్లిన్‌కు చెందిన మిచెల్ (30)కి ప్రేమించే మనసు ఉన్నా.. ఆమె ప్రేమించిన వ్యక్తికి మాత్రం ప్రాణం, మనసు రెండూ లేవు. కారణం ఆమె ప్రేమించింది ఓ విమానాన్ని కనుక. మిచెల్ (30), ఆరేళ్ల క్రితం విమానాశ్రం అద్దాల ద్వారా బోయింగ్-737 విమానాన్ని చూసి, దానిపై మనసు పారేసుకుంది. గత ఆరేళ్లుగా 40 టన్నుల ఆ విమానంతో ప్రేమలో మునిగి తేలుతోంది. ఆరేళ్లుగా ఆదే విమానంతో డేటింగ్ కూడా చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఇన్నేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే దగ్గరగా వెళ్లి ఆ విమానాన్ని కలిశానని తెలిపింది. విమానంతో గత ఆరేళ్లుగా డేటింగ్‌లో ఉన్నానంటూ చెప్పి అందర్నీ అవాక్కయ్యేలా చేసిన ఆమె.. మరో బాంబు పేల్చింది. బోయింగ్-737 విమానాన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. పెళ్లిలో ఎయిర్ హోస్టన్ డ్రెస్‌ వేసుకోనున్నట్లు ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే.. డాక్టర్లు మాత్రం ఆమె ఓ మానసిక సమస్యతో బాధ పడుతున్నట్లు తేల్చేశారు.

Related posts