telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లి కాబోతున్న గీతా మాధురి… ఘనంగా సీమంతం వేడుక

Geetha-Madhuri

సింగర్ గీతా మాధురి అంటే తెలియని వారుండరు. గీతామాధురి తన మధురమైన గాత్రంతో అంతలా పేరు సంపాదించుకుంది. దశాబ్దకాలం నుంచి టాలీవుడ్ లోని చిన్న, పెద్ద సినిమాలను తన గాత్రాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే మూడేళ్ళ క్రితం గీత, టాలీవుడ్ హీరో నందూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రియాలిటీ షో “బిగ్ బాస్” ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది గీత. దీంతో ఆమెకు మరింతగా పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం గీత మాధురి గర్భవతి. ఇటీవలే ఆమెకు సీమంతం వేడుకని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను అతి కొద్దిమంది స్నేహితులు, బంధువుల మధ్య నిర్వహించారు. ఇక త్వరలోనే గీత-నందూ జంట ఒక బేబీని తమ కుటుంబంలోకి ఆహ్వానించనున్నారు. ఈ విషయం వారు షేర్ చేస్తున్న వీడియోల ద్వారా అభిమానులకు తెలిసింది. ఇప్పుడు కొన్ని రోజులు సింగర్ గా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బేబీ పుట్టాక మళ్ళీ సింగర్ గా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Related posts