telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మార్చ్ 27 ప్రత్యేకత.. అదే రోజు ఆర్.ఆర్.ఆర్ నుండి ‘చరణ్’ ఫస్ట్ లుక్..

first look will be on march 27 from rajamouli

రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టి స్టారర్ గురించి మరో అప్ డేట్. ఈ చిత్రం నుండి వరుసగా ఫస్ట్ లుక్ లను విడుదల చేస్తున్నారు. అదికూడా వచ్చే నెల ఆఖరి వారం నుండి ప్రారంబిస్తారట. మొదటగా పోలీస్ బాబుదేనట. అలా ఎందుకంటె, ప్రత్యేకత లేకుండా జక్కన ఏదైనా చేస్తాడా..! ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటుగా .. చరణ్ ‘రామరాజు’ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.

ముగ్గురు మొనగాళ్లు మాదిరి, ముగ్గురు కథానాయికలు ఈ చిత్రంలో హాల్ చల్ చేయనున్నారట. ఒక కథానాయికగా అలియా భట్ ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రాలేదు. ఎన్టీఆర్ .. చరణ్ లలో ఎవరి ఫస్టులుక్ ముందుగా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫస్టులుక్ ముందుగా రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్టులుక్ ను వదలనున్నట్టు సమాచారం. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ‘బాహుబలి’ తరహాలోనే ఒక్కో లుక్ ను విడుదల చేస్తుంటారట.

Related posts