telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఫేస్‌బుక్‌ .. సొంత డిజిటల్‌ నగదు ‘లిబ్రా’..

facebook introduced own digital currency

ఫేస్‌బుక్‌ పై ఆరోపణలు వచ్చినప్పటి నుండి దాని విలువ పడిపోతుండటంతో.. సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు నూతనత్వం కోసం ప్రయత్నిస్తుంది. తాజాగా, నగదు వ్యవహారాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సొంత డిజిటల్‌ నగదు ‘లిబ్రా’ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మార్కెట్లోకి ఈ అంతర్జాతీయ డిజిటల్‌ నగదు ప్రవేశిస్తుందని వెల్లడించింది. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఖాతాదారులు తమ నగదును దాచుకోవడం, పంపడం, ఖర్చు చేయవచ్చునని తెలిపింది. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పంపినంత సులువుగా లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.

ఔత్సాహిక డెవలపర్లు ఉపయోగించుకోవడానికి వీలుగా లిబ్రా ప్రోటోటైప్‌ (నమూనా)ను ఓపెన్‌ సోర్సు కోడ్‌ (అందరూ ఉపయోగించుకునేలా) తరహాలో ఫేస్‌బుక్‌ తన దాదాపు 24 మంది భాగస్వాములతో కలిసి విడుదల చేసింది. జెనీవాలోని ఒక లాభాపేక్ష రహిత సంఘం ఈ బ్లాక్‌చైన్‌ ఆధారిత లిబ్రా పనులను పర్యవేక్షించనుంది. ఈ సంస్థ లిబ్రా విలువ స్థిరంగా ఉండేలా చూస్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ బ్యాంకు సేవలు అందని వంద కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని ఈ సంస్థ అంచనా వేసింది. వీరికి ఆన్‌లైన్‌ కామర్స్‌, ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురాగలమని లిబ్రా అసోసియేషన్‌ అధిపతి (పాసీ, కమ్యూనికేషన్స్‌) డాంటే డిస్సార్టీ తెలిపారు.

Related posts