telugu navyamedia
క్రైమ్ వార్తలు

కన్నబిడ్డపైనే 1800 సార్లు అత్యాచారం

women gang raped in capital of india

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి పైశాచిక ఆనందం కోసం కామాంధుడై ఏకంగా 1800 సార్లు కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది. బాలిక చిన్నతంలో వున్నప్పుడు తల్లి రెండో పెళ్లి చేసుకుంది. 41 ఏళ్ల ఆ కామాంధుడు.. తన కుమార్తెకు పదేళ్లున్నప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ ఆమెను బలవంతంగా ఒక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. కేకలు పెడితే దారుణంగా చితకబాదేశాడు. గర్భం వచ్చినట్లు తెలియగానే అబార్షన్ చేయించుకోవాలని పట్టుబట్టేవాడు. కడుపుపై పిడిగుద్దులు గుద్ది గర్భస్రావం అయ్యేలా చేసేవాడు.

అలా ఆరేళ్ల పాటు ఆ బాలికకు నరకం చూపించాడు. ఇలా ఆ బాలిక 15 ఏళ్ల వయస్సున్నప్పుడు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. పసిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలని ఆ కామాంధుడు శిశువును పక్కనే పెట్టుకుని బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇతని చెర నుంచి ఆ బాలిక 16వ ఏట ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 19 సంవత్సరాలు. గతాన్ని తలచుకుని కుమిలిపోతూ నాలుగేళ్ల కుమారుడి కోసం బతకాలని నిర్ణయించుకుంది. ఈ కేసు బ్రిస్బేన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్దకు రాగా ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదని, నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

Related posts