telugu navyamedia
culture news trending

గుడ్లగూబతో డైటింగ్ చేయించిన వైద్యులు… చివరకు…!

Owl

ఓ చిన్న గొయ్యిలో చతికిల పడ్డ ఆ పక్షిని చూసి ఇంగ్లండ్‌లోని సఫ్ఫోల్క్‌ బర్డ్ శాంక్చువరీ అధికారులు షాకయ్యారు. అది ఏదైనా వ్యాధితో బాధపడుతోందేమోనని తొలుత భావించారు. అన్ని వైద్య పరీక్షలూ చేశారు. అంతా సవ్యంగానే ఉన్నట్టు రిపోర్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారు దాని బరువును కూడా కొలిచారు. ఉండవలసిన దాని కన్నా ముడు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేమైనా పెంపుడు గుడ్లగూబా అనే సందేహం వారి మదిలో మెదిలింది. అయితే దాని కాళ్లకు ఎటువంటి స్టిక్కర్లుగానీ, పట్టీలుగానీ లేవు. అడవిలో స్వేఛ్చగా విహరించే జీవి కూడా ఇలా ఒబెసిటీతో బాధపడటం వారిని ఆశ్చర్య పరిచింది. అయితే పరిష్కారం గురించి ఆలోచించే కొద్దీ వారికి డైటింగే ఈ సమస్యకు పరిష్కారమని అనిపించింది. అయినా వారి మదిలో ఎక్కడో చిన్న సందేహం. అయితే మరో దారి లేని పరిస్థితిలో వారు గుడ్లగూబ‌తో డైటింగ్ చేయించారు. దానికి అందించే ఆహారంలో భారీగా కోత పెట్టారు. అత్యవసరమైన కేలరీలు మాత్రమే అందేలా చర్యలు తీసుకున్నారు. లంఖణం పరమౌషధం అన్న చందంగా ఈ చికిత్స జరిగింది. అయితే వారి సందేహాలన్నీ దూరం చేస్తూ.. ఈ ట్రీట్‌మెంట్ చక్కని ఫలితాలిచ్చింది. గూడ్లగూబ బరువు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో అది ఎగరటం కూడా ప్రారంభించింది. అద్భుతం జరిగిందంటూ సంబరపడిపోయారు సదరు శాంక్చువరీ అధికారులు

Related posts

విజయవాడ కనకదుర్గమ్మకు .. పట్టువస్త్రాలు సమర్పించనున్న .. ఏపీసీఎం జగన్ ..

vimala p

బాలీవుడ్ నటి ప్రియాంక .. మైనం విగ్రహాలు..

vimala p

స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్దం: డీజీపీ గౌతమ్ సవాంగ

vimala p