సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీపైడిపల్లి కాంబినేషన్ లో “మహర్షి” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిన సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత వంశీ దర్శకత్వంలోనే మహేష్ సినిమా చేయాలనుకున్నాడు. అయితే వంశీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ రోజు (సోమవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీపైడిపల్లికి ట్విటర్ ద్వారా మహేష్ బాబు విషెస్ తెలియజేశాడు. ‘దర్శకుడు వంశీపైడపల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఛార్మింగ్‌గా ఉండాలి. అలాగే నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
Happiest birthday @directorvamshi!! Keep smiling and spread your charm as you always do. Wishing you good health, happiness and love always 🤗
— Mahesh Babu (@urstrulyMahesh) July 27, 2020
ఇంకా చాలా విషయాలు బయటకు రాలేదు… మీటూపై హీరోయిన్ అసంతృప్తి