telugu navyamedia
సినిమా వార్తలు

నటి ఇంట్లోకి చొరబడి… పెళ్లి చేసుకోవాలంటూ విద్యార్ధి గొడవ…

Rithika

ప్రముఖ బుల్లితర నటి ఇంట్లోకి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రవేశించి వివాహం చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడిన సంఘటన చెన్నైలో కలకలం రేపింది. ప్రముఖ తమిళ ఛానల్‌లో ప్రసారమవుతున్న “రాజా రాణీ” అనే సీరియల్‌ తో పాటు పలు సీరియళ్లలో నటి రితిక నటిస్తోంది. వడపళని లోని 100 అడుగుల రోడ్డులోని మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తండ్రితో కలిసి నివాసముంటోంది. రితిక ఇంటికి వచ్చిన ఓ యువకుడు తనను వివాహం చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి రితిక తండ్రి నిరాకరించడంతో ఆ యువకుడు గొడవకు దిగాడు. కేకలు విన్న స్థానికులు, వాచ్‌మేన్‌ అక్కడికి చేరడంతో గొడవకు దిగిన ఆ యువకుడిన అదుపులోకి తీసుకుని వడపళని పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆ యువకుడిని విచారించగా గోపిచెట్టి పాళయానికి చెందిన భరత్‌ అని, ఇంజనీరింగ్‌ చదివిన తాను ఉద్యోగం వెతుక్కుంటూ చెన్నైకి వచ్చినట్లు తెలిసింది. ఉదయం సొంతూరికి బయలు దేరిన సమయంలో నటి ఇంటికి బయలు దేరి ఈ గొడవకు పాల్పడ్డట్టు తెలిసింది. బుల్లి తెర నటిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని, ఆమె తల్లిదండ్రులు అనుమతించకపోతే కిడ్నాప్‌ చేస్తానని భరత్‌ పోలీసులతో చెప్పడం గమనార్హం.

Related posts